నన్ను క్షమించండి.. అభిమాని పోస్ట్‌కు స్టార్ నటుడు రిప్లై

by Chukka Sudharani |

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, లెజెండరీ డైరెక్టర్ డేవిడ్ ధావన్ కాంబోలో రాబోతోన్న క్రేజీ ఎంటర్‌టైనర్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’.

నన్ను క్షమించండి.. అభిమాని పోస్ట్‌కు స్టార్ నటుడు రిప్లై
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, లెజెండరీ డైరెక్టర్ డేవిడ్ ధావన్ కాంబోలో రాబోతోన్న క్రేజీ ఎంటర్‌టైనర్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండగా.. ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల లక్నోలో పర్యటించారు. ఈ సందర్భంగా, తనను కలవడానికి 5 గంటల పాటు ఎదురుచూసిన అభిమానులను వరుణ్ కలవలేకపోయారు. దీనిపై తన నిరాశను వ్యక్తం చేసిన ఒక మహిళా అభిమాని.. ఆ స్టార్‌తో మాట్లాడే అవకాశం కోల్పోయినందుకు తన నిరాశను వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో, నటుల రాక కోసం ప్రేక్షకులు దాదాపు ఐదు గంటల పాటు ఎదురుచూస్తుండగా, వరుణ్ కేవలం 5 నిమిషాల్లోనే వెళ్లిపోయారని ఆమె పేర్కొన్నారు. దీనిపై వరుణ్ స్పందిస్తూ.. ‘క్షమించండి, నేను ఆటోగ్రాఫ్ ఇవ్వలేకపోయాను.. పోలీసులు మమ్మల్ని కొంచెం ముందుగానే వెళ్ళిపోయేలా చేశారు’ అని స్పష్టం చేశాడు. ఆమె పోస్ట్‌కు వరుణ్ స్పందించడంతో నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Next Story