- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబ్బాయిలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన హీరోయిన్.. ప్రపోజ్ చేయగానే !
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే కానీ అందులో.. కొంతమంది మాత్రమే అతి తక్కువ

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే కానీ అందులో.. కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) ఒకరు. మన తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ చలన చిత్రాలలో కూడా... ఈ అందాల తార వర్ష నటించారు. 2015 సంవత్సరంలో తమిళ ఇండస్ట్రీలో సతురన్ అనే సినిమాతో.. వెలుగులోకి వచ్చారు.
కర్ణాటక కు చెందిన ఈ అందాల తార... తెలుగులో కూడా సినిమాలు తీశారు. 2019 సంవత్సరంలో వచ్చిన చూసి చూడంగానే సినిమాతో... తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆ తర్వాత జాను, మిడిల్ క్లాస్ మెలోడీస్ లాంటి సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. పుష్పక విమానం సినిమాలో అతిధి పాత్ర చేసి కనువిందు చేశారు. అయితే అలాంటి వర్ష బొల్లమ్మ తాజాగా నితిన్ నటించిన తమ్ముడు సినిమాలో మెరిశారు.
అయితే ఈ సినిమా సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వర్ష బొల్లమ్మ. తనకు చాలామంది ఇప్పటికే ప్రపోజ్ చేశారని వివరించారు. అయితే ప్రపోజ్ చేయడం తప్పు కాదని... ప్రపోజ్ చేసిన వెంటనే తాను నో... చెప్పినట్లు క్లారిటీ ఇచ్చారు. వెంటనే మనం ప్రపోజ్ చేసిన వాళ్లకు సమాధానం ఇస్తే... అవతలి వ్యక్తి లైఫ్ కూడా బాగుంటుందని ఆమె కామెంట్ చేశారు. నచ్చితే నచ్చింది అని చెప్పాలి లేకపోతే లేదని అప్పుడే చెప్పేస్తే ఎలాంటి బాధ ఉండదని కూడా ఆమె వివరించారు. దీంతో వర్ష చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.






