మ‌హేష్ బాబుకు కొత్త టెన్ష‌న్..ఒకే నెల‌లో వార‌ణాసి, స్పిరిట్ !

by velandi.Saikiran |

బడా సినిమాలు వారణాసి, స్పిరిట్ రెండు సినిమాలు కూడా 2027 మార్చిలో రిలీజ్ కాబోతున్నాయి.

మ‌హేష్ బాబుకు కొత్త టెన్ష‌న్..ఒకే నెల‌లో వార‌ణాసి, స్పిరిట్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వెయిటింగ్ సినిమాలు స్పిరిట్, వారణాసి. భారీ బడ్జెట్ తో పాటు భారీ అంచనాల నడుమ ఈ రెండు సినిమాలు వస్తున్నాయి. అందులోనూ ఈ రెండు సినిమాలను తీసేది 100% సక్సెస్ రేటు ఉన్న దర్శకులే కావడం గమనార్హం. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ హీరోగా చేస్తుండగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తృప్తి డిమ్రి హీరోయిన్ గా మెరువనున్నారు. ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ గెటప్ లో కనిపిస్తారట.

దేశ భద్రత నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నట్లు నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఓ పోస్టర్ ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసింది. ఇక అటు జక్కన్న దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమా టైటిల్ టీజర్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ఈ సినిమాలో ఏకంగా మహేష్ బాబు ఐదు పాత్రల్లో కనిపిస్తారని టాక్ నడుస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఉంటుందట.

ఒకే నెలలో రెండు సినిమాలు

బడా సినిమాలు వారణాసి, స్పిరిట్ రెండు సినిమాలు కూడా 2027 మార్చిలో రిలీజ్ కాబోతున్నాయి. అంటే ఈ నెలలో మంచి స్టఫ్ తెలుగు అభిమానులకు దొరకనుంది. మార్చి 5వ తేదీన స్పిరిట్ మూవీ రిలీజ్ కానుండగా.. మార్చి 25వ తేదీన మహేష్ బాబు నటించిన వారణాసి రిలీజ్ అవుతుంది. దీంతో ఇండస్ట్రీ కళ్ళు మొత్తం ఈ రెండు సినిమాల పైన పడ్డాయి. రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకుంటాయని కూడా అంచనా వేస్తున్నారు. ఈ రెండు సినిమాల నడుమ మరే సినిమా వచ్చినా, షెడ్డు కు వెళ్లాల్సిందే అంటున్నారు.

Next Story