హైదరాబాద్‌లో వారణాసి షూటింగ్.. నెక్స్ట్ ప్లానేంటో తెలుసా?

by Pulgam srinivas |   (  Updated:2026-04-04 10:59:01  IST  )

ప్రస్తుతం వారణాసి చిత్ర షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే చిత్ర బృందం కొద్దిరోజుల విరామం తీసుకోనున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌లో వారణాసి షూటింగ్.. నెక్స్ట్ ప్లానేంటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఇండియన్ చిత్రాల్లో ‘వారణాసి’ మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుండగా, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొంటున్నారు.

ఈ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే చిత్ర బృందం కొద్దిరోజుల విరామం తీసుకోనున్నట్లు సమాచారం. ఆ గ్యాప్లో మహేష్ బాబు విదేశాలకు వెకేషన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తుండగా, రాజమౌళి తన కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. వీరంతా తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన సుమారు 80% షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు, అందుకు అనుగుణంగానే ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

యాక్షన్ షురూ.. ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్‌ విడుదల డేట్ ఫిక్స్

Next Story