- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Varanasi : సింపుల్ కన్ఫర్మేషన్
ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న భారతీయ చిత్రాలలో ఒకటిగా ‘వారణాసి’ నిలిచింది. మహేష్ బాబు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి తొలిసారిగా చేస్తున్నారు.

దిశ, సినిమా : ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న భారతీయ చిత్రాలలో ఒకటిగా ‘వారణాసి’ నిలిచింది. మహేష్ బాబు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి తొలిసారిగా చేస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నవంబర్‌లో జరిగిన గ్లోబ్ ట్రోట్టర్ ఈవెంట్ అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాల్ని తారాస్థాయికి పెంచేసింది. త్రేతాయుగంలో ప్రారంభమై, వారణాసిలో 512 CE గుండా ప్రయాణించి, 2027 CEకి మారి, త్రేతాయుగం (7200 BCE)కి తిరిగి వస్తుందని గ్లింప్స్‌తో చెప్పకనే చెప్పేశారు. కాగా ఈ విజువల్ వండర్‌ను ఏప్రిల్ 7, 2027న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. బిగ్ స్క్రీన్ మీద ఒక భారీ, ఎపిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు.






