- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Varalakshmi Sarath Kumar: హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త సినిమా.. ఆకట్టుకుంటోన్న వరలక్ష్మి శరత్ కుమార్ లుక్
ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar).

దిశ, సినిమా: ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar). ఇప్పుడు ఈమె తెలుగులో ‘పోలీస్ కంప్లెయింట్’ (Police Complaint) అనే మూవీ చేస్తోంది. హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త జోనర్‌లో రాబోతున్న ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ వపర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా.. తాజాగా ఈ సినిమా నుంచి ఈమెకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ పోస్టర్‌లో వరలక్ష్మి గన్ ఫైర్ చేస్తూ సీరియస్ లుక్‌లో కనిపించి మెప్పిస్తుంది.
ఈ చిత్రాన్ని ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్, శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా సంస్థల సంయుక్త బ్యానర్లలో సింగపూర్ బాలకృష్ణ , మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. దీనికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, అమిత్, దిల్ రమేష్, రాజశ్రీ నాయర్, సింగపూర్ బాలకృష్ణ, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీహర్ష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా.. ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ మీద స్పెషల్ సాంగ్ షూట్ చేసామని, అది సినిమాకే మెయిన్ హైలెట్‌గా నిలుస్తుందని ఈ సందర్భంగా నిర్మాతలు తెలిపారు.






