- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్యకు పద్మభూషణ్ రావడంపై వరలక్ష్మీ శరత్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ (వీడియో)
నందమూరి బాలకృష్ణ(Balakrishna) వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు.

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘డాకు మహారాజ్’(Daaku Maharaj) సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ విషయాన్ని అందుకుంది. బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. అయితే ‘డాకు మహారాజ్’ హిట్ కొట్టడంతో పాటు భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసును షేక్ చేస్తుంది. ఈ క్రమంలోనే నటసింహం బాలయ్యకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సినీ సెలబ్రిటీలతో పాటు,రాజకీయ నాయకులు కూడా విషెస్ తెలపడంతో పాటు ఆయనను సత్కరించారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, బాలకృష్ణకు పద్మ విభూషణ్ అవార్డు రావడంపై నటి వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarath Kumar) స్పందించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను బాలయ్యతో మాట్లాడాను. అంతేకాకుండా నా భర్త నిక్కు కూడా ఆయన రీసెంట్ సాంగ్‌కు పెద్ద ఫ్యాన్స్ అని చెప్పి అవార్డ్ అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే బాలకృష్ణకు అవార్డు అందుకునే అర్హత ఉంది. ఆయన ఫిల్మ్ కెరీర్ పక్కన పెడితే ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. అలాగే క్యాన్సర్ వచ్చిన వాళ్లకు ఎంత చేశారో చూశాను. సినిమా కెరీర్ అందరికీ ఉంటుంది. కొన్నిసార్లు కలిసివస్తుంది.. మరి కొన్ని సమయాల్లో బ్యాడ్ అయితుంది. కానీ ఇంకో మనిషికి సాయం చేయాలంటే మంచి మనసు ఉండాలి. అది బాలకృష్టకు ఉండటం వల్ల ఇంతమందికి మంచి జరుగుతుంది’’ అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన వారంతా గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 2021లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ అఖండకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. దీనికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ సంయుక్తా మీనన్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను బాలయ్య రెండో కూతురు తేజస్వి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నామ్ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ‘అఖండ-2’ సెప్టెంబర్ 25న వచ్చే ఏడాది దసరా కానుకగా థియేటర్స్‌లోకి రానున్నట్లు సమాచారం.
పద్మ అవార్డు అందుకునే అర్హత బాలయ్యకు వుంది pic.twitter.com/8JXhwMYMU5
— Telugu360 (@Telugu360) January 27, 2025






