Varalaxmi Sarathkumar: ఇదే మాట మగ నటుడిని అడగండి.. ఇలాంటి సమాధానం ఊహించి ఉండరు

by Pulgam srinivas |

వరలక్ష్మీ మాట్లాడుతూ... నన్ను లేడీ యాంగిల్ నుండి సినిమా చేశారు అంటున్నారు. మగ హీరోలు కూడా యాక్షన్ సినిమాలు చేస్తారు, వారిని కూడా ఇదే ప్రశ్న అడగండి అని ఈమె తాజాగా చెప్పారు.

Varalaxmi Sarathkumar: ఇదే మాట మగ నటుడిని అడగండి.. ఇలాంటి సమాధానం ఊహించి ఉండరు
X

దిశ, వెబ్ డెస్క్: నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. తమిళ సినిమాల ద్వారా కెరీర్ను మొదలుపెట్టిన ఈ బ్యూటీ తెలుగులో కూడా ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా, అందులో ఎక్కువ శాతం ప్రతినాయక పాత్రల్లోనే నటించింది. ఈమెకు క్రాక్, వీర సింహారెడ్డి సినిమాలతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ రెండు సినిమాల్లో కూడా ఈ బ్యూటీ నెగిటివ్ పాత్రలలోనే నటించింది.

ఈ రెండింటికి కూడా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. తాజాగా వరలక్ష్మి 'సరస్వతి' అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. ఈ సినిమా మార్చి 6వ తేదీన విడుదలైంది. ఈ మూవీ విడుదల సందర్భంగా ఈమె పాత్రికేయులతో ముచ్చటించింది. అందులో భాగంగా ఈమెకు "మీరు సినిమాను మొత్తంగా లేడీస్ యాంగిల్ నుండే చూపించారు, మీరు లేడీ డైరెక్టర్ కాబట్టే అలా చూపించారు.

మగవాళ్లకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, వాటిపై ఎక్కువ దృష్టి పెట్టలేదు అని కొంతమంది అంటున్నారు" అనే ప్రశ్న ఎదురైంది. దానికి వరలక్ష్మి "ఇదే ప్రశ్న మీరు మగ హీరోలను అడగాలి, వారు ఎక్కువ శాతం యాక్షన్ సినిమాలు చేస్తుంటారు. మరి వారెందుకు అలా చేస్తున్నారు? అనే ప్రశ్న మీరు వారిని కూడా అడిగితే బాగుంటుంది" అని సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం వరలక్ష్మి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Next Story