- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊపేస్తున్న ‘వామ్మో.. వాయ్యో’ పాట
మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు.

దిశ, సినిమా : మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. మొదటి రెండు పాటలు ఇప్పటికే అద్భుతమైన స్పందనను పొందాయి. తాజాగా వరంగల్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో మూడో ట్రాక్ ‘వామ్మో వాయ్యో’ లాంచ్ చేశారు మేకర్స్. భీమ్స్ సిసిరోలియో మరోసారి మాస్ ఆడియన్స్‌ను కట్టిపడేసే సాంగ్ కంపోజ్ చేశారు. ‘వామ్మో వాయ్యో’ ఫుల్ జోష్‌తో సాగే ఫోక్ ట్రాక్‌గా నిలుస్తూ, వినగానే ఎనర్జీని ఇస్తుంది. లైవ్లీ ఆర్కెస్ట్రేషన్ పాటకు ప్రాణం పోస్తే, స్వాతి రెడ్డి అందించిన వాయిస్ ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. దేవ్ పవార్ రాసిన లిరిక్స్ రస్టిక్ ఫ్లేవర్‌తో పాటు పక్కా మాస్ టచ్ ఉండగా.. శేఖర్ VJ మాస్టర్ కొరియోగ్రఫీ హై ఎనర్జీ స్టెప్స్‌తో కిక్ ఇచ్చింది. హీరో హీరోయిన్లు ఈ పాటకు తమ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు.






