స్టార్ హీరో మూవీలో చాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ.. చిన్ననాటి కల నెరవేరుతుందంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి(Wamika Gabbi) వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. గత ఏడాది ‘బేబీ జాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

స్టార్ హీరో మూవీలో చాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ.. చిన్ననాటి కల నెరవేరుతుందంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి(Wamika Gabbi) వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. గత ఏడాది ‘బేబీ జాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ అనుకున్నంత హిట్ సాధించలేకపోయింది. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు వామికా గబ్బి ‘భూల్ చుక్ మాఫ్’ (Bhool Chuk Maaf)సినిమాతో ప్రేక్షకుల మందుకు రానుంది. రాజ్ కుమార్ రావు(Raj Kumar Rao) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కరణ్ శర్మ(Karan Sharma) తెరకెక్కించారు. అయితే షూటింగ్ పూర్తి చేసుకోగా..పలు వివాదాల కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఇక అన్ని సర్దుమనగడంతో ఈ సినిమా మే 23న థియేటర్స్‌లోకి రానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, వామికా గబ్బి మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుపుతూ షూటింగ్ వీడియోను షేర్ చేసింది. ప్రియదర్శన్(Priyadarshan) దర్శకత్వంలో రాబోతున్న హారర్ కామెడీ సినిమా ‘భూత్ బంగ్లా’(Bhoot Bangla)లో వామికా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తుండగా.. టబు, పరేష్ రావల్(Paresh Rawal) కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 2న థియేటర్స్‌లోకి రానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ నేటితో ముగుస్తోంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘నా జీవితమంతా అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ సినిమాలను చూసి ఆస్వాదించాను.

ఇప్పుడు నేను కూడా వారి ప్రపంచంలో భాగమయ్యాను. ఇది నా చిన్ననాటి కల. భూత్ బంగ్లాతో నెరవేరుతుంది. ఇది అత్యంత అద్భుతమైన అనుభవం. ఎక్తాకపూర్‌కు, అక్షయ్ కుమార్‌ సర్‌కు ధన్యవాదాలు.భూత్ బంగ్లాను అనుభవించే వరకు నేను వేచి ఉండలేను. ఇది నాకు అత్యం ఇష్టమైన నటి టబుతో నా రెండవ చిత్రం. ఇది ఇక మాయా ప్రయాణం.. పిచ్చి మాయాజాలం’’ అని రాసుకొచ్చింది. అలాగే ఓ వాటర్ ఫాల్స్ వద్ద అక్షయ్ కుమార్‌తో కలిసి షూట్‌లో పాల్గొంటున్న వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు సూపర్ ఎక్జైటింగ్‌గా ఉన్నామని కామెంట్లు చేస్తున్నారు.

Next Story