- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాలెంటైన్స్ వీక్ స్పెషల్.. థియేటర్లలో రీ రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వాలెంటైన్స్ వీక్‌ను మ్యూజిక్ కన్సర్ట్‌లా మార్చేందుకు టాలీవుడ్ సిద్ధమైంది. ఈ క్రమంలో ఏకంగా ఐదు సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో లవ్ బర్డ్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి వాలెంటైన్స్ వీక్‌లో థియేటర్లలో ఏఏ సినిమాలు రీ రిలీజ్ కానున్నాయో ఇప్పుడు మనం చూద్దాం..
ఫిబ్రవరి 6వ తేదీన ధనుష్(Dhanush), శృతి హాసన్(Shruti Haasan) జంటగా నటించిన ‘3’ సినిమా రీ రిలీజ్ కానుంది. అనిరుధ్(Anirudh) సంగీతం అందించిన ఈ మూవీ మళ్లీ థియేటర్లలో చూసేలా చేస్తోంది.
ఫిబ్రవరి 7వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), జెనీలియా(Genelia) జంటగా నటించిన కల్ట్ క్లాసికల్ ‘ఆరెంజ్’(Orange) మూవీ 4కె వర్షన్‌లో ప్రేక్షకులను పలకరించనుంది.
ఫిబ్రవరి 14న ఏకంగా మూడు లవ్ స్టోరీస్ రీ రిలీజ్ కానున్నాయి. నాగ చైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’(Love Story), అప్పట్లో ఉర్రూతలూగించిన ఉదయ్ కిరణ్(Uday Kiran) నటించిన ‘మనసంతా నువ్వే’(Manasanta Nuvve), నాగ చైతన్య(Naga Chaitanya), సమంత(Samantha) జంటగా నటించిన ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. ఈ ఐదు సినిమాలు తమ మ్యూజిక్ మరియు ఎమోషన్స్‌తో థియేటర్లను మ్యూజికల్ కన్సర్ట్స్‌లా మార్చేందుకు రెడీ అయ్యాయి.






