- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vakkantham Vamsi : టెంపర్ క్లైమాక్స్ అలా మారింది.. పూరి చెప్పింది చేసుంటే అలా ఉండేది
Vakkantham Vamsi : టెంపర్ సినిమా క్లైమాక్స్ విని పూరి జగన్నాథ్ గారు షాక్ అయ్యి నాకెందుకు ఇలాంటి ఆలోచనలు రావు అని అన్నట్లు వంశీ చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ కథా రచయితలలో ఒకరైన వక్కంతం వంశీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తన కెరీర్లో ఎక్కువ శాతం సురేందర్ రెడ్డి సినిమాలకు కథను అందించాడు. కథా రచయితగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వంశీ ఇప్పటికే మెగా ఫోన్ పట్టి దర్శకుడు కూడా అయ్యాడు. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' చిత్రాలకు దర్శకత్వం వహించాడు. కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'టెంపర్' అనే చిత్రం తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే.
దీనికి వంశీ కథను అందించాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా వంశీ మాట్లాడుతూ... 'టెంపర్' మూవీ క్లైమాక్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. వంశీ మాట్లాడుతూ... 'టెంపర్' మూవీ క్లైమాక్స్ మినహాయిస్తే కథ మొత్తం పూర్తయింది. దానిని పూరి గారికి వినిపించాను. "అమ్మాయిని పాడు చేసినట్లు ఎవిడెన్స్ ఏమీ లేదు కాబట్టి కోర్టు బయట వారందరినీ ఎన్టీఆర్ చంపేస్తాడు, ఇంతటితో సినిమా పూర్తి అవుతుంది" అని పూరి గారు అన్నారు.
కానీ నాకు మాత్రం ఆ ఎండింగ్ నచ్చలేదు. నేను పూరి గారితో "కొంత సమయం ఇవ్వండి, మరో క్లైమాక్స్ రాయడానికి ప్రయత్నిస్తాను" అని అన్నాను. ఆ సమయంలో నాకు ఐడియా వచ్చింది. "ఆ అమ్మాయిని పాడు చేసినట్లు ఏ సాక్ష్యం లేదు, కాబట్టి ఆ నలుగురితో పాటు నేను కూడా ఆ అమ్మాయిని పాడుచేసిన దాంట్లో ఉన్నాను" అని హీరో అంటాడు, ఆ తర్వాత మీరు చెప్పిన క్లైమాక్స్ ఫైట్ పెట్టండి అన్నాను. దానితో పూరి గారు సర్ప్రైజ్ అయ్యి "నాకెందుకు ఇలాంటి ఆలోచనలు రావు" అని అన్నట్లు వంశీ చెప్పుకొచ్చారు.






