Vaishnavi Chaitanya: అందాలతో దాడి చేస్తున్న యూట్యూబ్ బ్యూటీ

by Pulgam srinivas |

Vaishnavi Chaitanya: హాట్ అందాలతో హీట్ పెంచుతున్న యంగ్ బ్యూటీ.

Vaishnavi Chaitanya: అందాలతో దాడి చేస్తున్న యూట్యూబ్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో కూడా రాణించిన అతి కొద్దిమంది బ్యూటీలలో వైష్ణవి చైతన్య ఒకరు. ఈమె షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.




కొంతకాలం క్రితం ఈ నటి ఆనంద్ దేవరకొండ, విరాజ్ హీరోలుగా రూపొందిన బేబీ అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఇందులో తన నటనతో, అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం కూడా మంచి విజయం అందుకుంది. దానితో ఒక్కసారిగా ఈమెకు హీరోయిన్గా మంచి గుర్తింపు వచ్చింది.




ఆ తర్వాత ఈ షార్ట్ ఫిల్మ్ బ్యూటీకి వరుస పెట్టి చాలా సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా బేబీ తర్వాత ఈమె లవ్ మీ, జాక్ చిత్రాలలో హీరోయిన్గా నటించింది. కానీ ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం వైష్ణవి, ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఏపిక్ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది.




ఈ మూవీకి ఆదిత్య హసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. బేబీ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రిపీట్ అవుతున్న కాంబో కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సినిమాల్లో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను భారీగా ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు హీట్ పెంచుతున్న వైష్ణవి తాజాగా కూడా అదిరిపోయే రేంజ్ అందాలతో ప్రేక్షకులకు ఫుల్ ట్రీట్ ఇచ్చింది.




వైష్ణవి రీసెంట్గా సూపర్ హాట్ లుక్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ డ్రెస్ వేసుకొని తన సూపర్ అందాలు ప్రదర్శితమయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది, అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Next Story