అనిల్ సుంకర బ్యానర్‌లో వైష్ణవ్ తేజ్ మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

by Pulgam srinivas |

పంజా వైష్ణవ్ తేజ్ తదుపరి సినిమా అనిల్ సుంకర బ్యానర్‌లో, మహేష్ సూరపనేని దర్శకత్వంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది.

అనిల్ సుంకర బ్యానర్‌లో వైష్ణవ్ తేజ్ మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు పంజా వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయమైన ఈయన తొలి చిత్రంతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆయన నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయాయి. ఇటీవల ఈ నటుడు ‘ఆది కేశవ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఈ చిత్రం కూడా ఆయనకు నిరాశనే మిగిల్చింది. ఈ సినిమా విడుదలై చాలా కాలం అయినప్పటికీ తదుపరి ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ తన నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అనిల్ సుంకర బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుందని, ‘హంట్’ ఫేమ్ మహేష్ సూరపనేని దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్‌కు సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని, మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Next Story