అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వడ్డే నవీన్

by Pulgam srinivas |   (  Updated:2026-06-12 03:37:25  IST  )

గత 10 ఏళ్లలో అత్యంతగా ఎదిగిన హీరోలలో అల్లు అర్జున్ మొదటి వరుసలో ఉంటాడని వడ్డే నవీన్ అభిప్రాయపడ్డారు.

అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వడ్డే నవీన్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న వడ్డే నవీన్ చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. తాజాగా ఈయన ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ మూవీ జూన్ 19వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా వడ్డే నవీన్‌కు ఆఖరి పదేళ్లలో మీ ఉద్దేశంలో అద్భుతంగా ఎదిగిన హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురయింది. దీనికి ఈ నటుడు అల్లు అర్జున్ అని సమాధానం ఇచ్చాడు.

అలాగే ప్రభాస్ హీరోగా రాజమౌళి ‘బాహుబలి’ చిత్రాన్ని రూపొందించాడు. దానిని ముందు నుంచే గ్లోబల్ చిత్రంగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. అందుకు అనుగుణంగానే ఆ సినిమా కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకుంది. ఇక రాజమౌళి లాంటి దర్శకుడు ఉండడంతో ఆ మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు, బడ్జెట్‌కు తగినట్లు సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ‘పుష్ప’ సినిమాను మాత్రం కేవలం తెలుగు కోసమే రూపొందించారు. కానీ ఆ తర్వాత చాలా భాషల్లో విడుదల చేశారు. అది పెద్ద బ్లాస్ట్ అయింది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అల్లు అర్జున్‌కు పెద్ద స్థాయిలో క్రేజ్ వచ్చింది. అందుకే నా అభిప్రాయం ప్రకారం 10 ఏళ్లలో బాగా ఎదిగిన హీరోల్లో అల్లు అర్జున్ మొదటి వరుసలో ఉంటాడని వడ్డే నవీన్ చెప్పుకొచ్చాడు.

స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా రిలీజ్ కానున్న వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ట్రైలర్

Next Story