- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vaani Kapoor: ‘మండలా మర్డర్స్’ స్ట్రీమింగ్ అప్డేట్ ఇచ్చిన వాణీ కపూర్
బాలీవుడ్ నటి వాణీ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘మండల మర్డర్స్’.

దిశ, సినిమా: బాలీవుడ్ నటి వాణీ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘మండల మర్డర్స్’. శతాబ్దాల క్రితం చరణ్‌దాస్‌పూర్‌లో జరిగిన హత్యల నేపథ్యంలో రూపొందిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌ను యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుండగా.. గోపి పుత్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కాగా.. వాణీ కపూర్ చరణ్‌దాస్‌పూర్ అనే రహస్య పట్టణంలో అనుమానాస్పద మరణాలను దర్యాప్తు చేసే ఆఫీసర్‌గా నటించింది. ఆమె యాక్షన్ సీన్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకోగా.. ఈ సిరీస్ రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘మండల మర్డర్స్’ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా జులై 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుపుతూ.. వాణీ కపూర్ తన సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకుంది. కాగా.. ఈ సిరీస్‌లో శ్రియా పిల్గావ్‌కర్, సిద్ధాంత్ కపూర్, రాహుల్ బగ్గా, రఘుబీర్ యాదవ్, మోనికా చౌదరి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లింక్






