- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ దర్శకుడికి మరో అవకాశం ఇచ్చిన యూవీ క్రియేషన్స్
కపుల్ ఫ్రెండ్లీ మూవీ దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తన రెండవ సినిమాను కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లోనే చేయబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: సంతోష్ శోభన్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్‌గా, అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే చిత్రం రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించారు. కొంతకాలం క్రితం విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారానే దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించిన అశ్విన్ చంద్రశేఖర్‌కు కూడా ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకువచ్చింది. దాంతో ఆయన తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నారనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో పెరిగింది.
తాజాగా ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దర్శకుడు తన రెండవ సినిమాను కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లోనే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ అయినట్లు, ఆ కథకు తగిన హీరో కోసం మూవీ బృందం వెతుకులాటను ప్రారంభించినట్లు సమాచారం. ‘కపుల్ ఫ్రెండ్లీ’ సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్న దర్శకుడు కావడంతో, ఆయన తదుపరి చిత్రంపై కూడా మంచి అంచనాలు నెలకొనే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






