- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ustad Bhagat Singh: ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆయన లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ వేడుకకు దేవిశ్రీప్రసాద్ హాజరు కాలేదు. దాంతో ఆయన లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏదైనా సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు అంటే ఆ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో ఆయన సందడి అద్భుతంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే తెలుగు సినిమా పరిశ్రమలో ఆడియో ఫంక్షన్లను పెద్ద స్థాయిలో నిర్వహించేవారు. అలాంటి సమయంలో ఈ మ్యూజిక్ డైరెక్టర్ స్టేజ్ మీద ఎక్కి సినిమాకు సంబంధించిన పాటలన్నీ స్వయంగా పాడుతూ జనాలను అలరించేవాడు. ఆ వేడుకకు కళను తెచ్చేవాడు.
ఈ మధ్యకాలంలో ఆడియో ఫంక్షన్లు చేయడం లేదు, సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. వాటిలో కూడా దేవిశ్రీప్రసాద్ హంగామా చాలా ఉండేది. ఆయన సంగీతం అందించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందంటే చాలు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు దేవిశ్రీప్రసాద్ స్టేజి పైకి ఎక్కుతాడా అని ఆత్రుతగా ఎదురు చూస్తారు.
తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం రూపొందింది. దీనికి దేవిశ్రీప్రసాద్, తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయనున్నారు. దాంతో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కానీ దానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ హాజరు కాలేదు. దానితో ఆయన లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అని అనేకమంది అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలోని పాటలకు దేవిశ్రీప్రసాద్, నేపథ్య సంగీతానికి తమన్ సంగీతం అందించారు.






