ఉస్తాద్ భగత్ సింగ్ vs స్వయంభు.. ఒకే నెలలో పోటీ పడబోతోన్న రెండు చిత్రాలు

by Chukka Sudharani |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’.

ఉస్తాద్ భగత్ సింగ్ vs స్వయంభు.. ఒకే నెలలో పోటీ పడబోతోన్న రెండు చిత్రాలు
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. శ్రీ లీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవిశంకర్ నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్ని అనివార్య కారణాల చేత షూటింగ్ వాయిదా పడగా.. మళ్లీ రీసెంట్‌గా రీ స్టార్ట్ అయ్యింది. ప్రజెంట్ ఈ చిత్రం షూటింగ్‌లో వేగం పెంచినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్‌సింగ్ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఫిలిమ్ వర్గాల నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇక అదే టైమ్‌లో మరో మూవీ బాక్సాఫీస్ రేసుకు సిద్ధం అవుతున్నది.

హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’. పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రాబోతున్న ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్, టాగూర్ మధు ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. గత కొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. అయితే.. ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే స్వయంభు మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది రిలీజ్‌కు రెడీ కావడంతో.. ఇక బాక్సాఫీస్ మామూలుగా ఉండదు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story