Ustad Bhagat Singh: అందుకే ఆ సీన్ రెండుసార్లు పెట్టాను.. హరీష్ శంకర్

by Pulgam srinivas |

ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఆ సీన్‌పై ట్రోల్స్.. హరీష్ శంకర్ క్లారిటీ

Ustad Bhagat Singh: అందుకే ఆ సీన్ రెండుసార్లు పెట్టాను.. హరీష్ శంకర్
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చ్ 19న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించగా, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే నెగటివ్ టాక్ రావడంతో, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి కలెక్షన్లు రాబట్టడంలో విఫలమైంది.

ఇదిలా ఉంటే, ఈ సినిమాలోని ఒక సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఫైట్ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ పోలీస్ యూనిఫామ్‌లో గుడి ఆవరణలో ఫైట్ చేస్తాడు. ఆ సన్నివేశంలో మొదట ఆయన జీప్‌లో నుంచి దిగిన తర్వాత, మళ్లీ మరోసారి అదే జీప్ నుంచి దూకినట్లు చూపించడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

దీంతో “ఇప్పటికే ఒకసారి దిగిన తర్వాత మళ్లీ ఎందుకు దూకారు?” అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్‌పై తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ… ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారు మొదట జీప్‌లో నుంచి దిగే సన్నివేశం ఒకటి ఫైట్ మాస్టర్ తీశారు. మరోసారి జీప్ నుంచి దూకే సన్నివేశాన్ని నేను తీశాను. రెండు సన్నివేశాలు నాకు బాగా నచ్చాయి. అందుకే రెండింటినీ సినిమాలో ఉంచాను” అని క్లారిటీ ఇచ్చారు.

Next Story