Ustad Bhagat Singh: ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ.. వేదిక ఖరారు

by Pulgam srinivas |

,ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని మార్చ్ 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Ustad Bhagat Singh: ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ.. వేదిక ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందా, తమ అభిమాన నటుడిని ఎప్పుడు దగ్గర నుండి చూస్తామా అని ఎంతో మంది పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఈ మూవీ బృందం తాజాగా సూపర్ అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను మార్చ్ 15వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాదులోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను మార్చ్ 19న విడుదల చేయనున్నారు.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ప్రమోషన్లను బాగానే నిర్వహిస్తుంది. కానీ పవన్ మాత్రం ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగానే ఉన్నాడు. రేపు జరగబోయే ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఆయన విచ్చేయనున్నారు. పవన్ ఈ సినిమా గురించి ఎలాంటి విషయాలు చెబుతారా అని ఎంతో మంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ గనుక బాగున్నట్లయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా కనిపించనుండగా, హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. దేవిశ్రీప్రసాద్, తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి సంస్థ వారు నిర్మించారు.




Next Story