- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ustad Bhagat Singh: నైజాం టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యేది అప్పుడే
ఈరోజు రాత్రి 10 గంటల నుండి నైజాం ఏరియాలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మార్చ్ 19న విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నైజాం టికెట్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ కాబోతున్నాయి అనే దానిపై అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈరోజు రాత్రి 10 గంటల నుండి నైజాం ఏరియాలో ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది.
ఈ మూవీ విడుదలకు ఇంకా మూడు రోజులు మిగిలి ఉంది. మూడు రోజుల ముందే నైజాంలో బుకింగ్స్ ఓపెన్ కానుండడంతో ఈ చిత్రానికి ఇది కలిసి వచ్చే అంశమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. దేవిశ్రీప్రసాద్, ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి సంస్థ వారు నిర్మించారు. పార్థిబన్, రావు రమేష్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.






