స్టేడియంలో ఊర్వశి దబిడి దబిడి మాస్ స్టెప్పులు.. డ్యాన్స్ చేస్తుండగానే ముద్దు పెట్టిన వ్యక్తి

by Kodari Anjali |

స్టేడియంలో ఊర్వశి దబిడి దబిడి మాస్ స్టెప్పులు.. డ్యాన్స్ చేస్తుండగానే ముద్దు పెట్టిన వ్యక్తి
X

దిశ, వెబ్‌డెస్క్: రీసెంట్ గా జరిగిన ఇండియా-పాకిస్థాన్ (India-Pakistan) మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌‌లో టీమిండియా (Team India) బ్యాటింగ్ అండ్ బౌలింగ్‌లో అదరగొట్టారు. పాకిస్థాన్‌ను చిత్తు చేశారు. ఇండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సూపర్ సండే బ్లాక్ బస్టర్ మ్యాచ్ దుబాయ్ స్టేడియా(Dubai Stadium)నికి అనేక మంది సినీ సెలబ్రిటీలు, క్రికెట్ లవర్స తరలివచ్చారు. భారత సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఇండియా మ్యాచ్ చూడానికి వచ్చారు. ఇక్కడికి బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) కూడా వచ్చింది. అందరిలో ఈ బ్యూటీ అట్రాక్షన్‌గా నిలిచింది.

ఇక ఊర్వశి(Urvashi)కి క్రికెట్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లకు కూడా అటెంట్ అయ్యింది. అయితే అటు పాక్ - ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతుంటే ఓ వైపు ఊర్వశి కిక్కిరిసిన స్టేడియంలో మాస్ స్టేప్పులేసి డ్యాన్స్ అదరగొట్టింది. ఒక్కసారిగా అక్కడున్న వారంతా చూపు ఈ భామపై తిప్పుకుంది. ఈ బాలీవుడ్ బ్యూటీతో పాటు మరో పర్సన్ కూడా స్టెప్పులేశారు. వీరిద్దరు కలిసి బాలయ్య (Balakrishna) సినిమాలోని ‘దబిడి దబిడి’ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలోనే ఊర్వశితో స్టెప్పులేస్తోన్న వ్యక్తి తనకు ముద్దు పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story