- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి వార్తల్లో నిలిచిన ఉర్ఫీ.. వెరైటీ ఔట్ ఫిట్‌తో వైరల్ అవుతున్న బ్యూటీ
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా పేరుగాంచిన ఉర్ఫీ జావేద్.. ఆకట్టుకునే అందం, అభినయం ఉన్నా సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా సందడి చేస్తుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా పేరుగాంచిన ఉర్ఫీ జావేద్.. ఆకట్టుకునే అందం, అభినయం ఉన్నా సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా సందడి చేస్తుంది. కంటెంట్ క్రియేటర్‌గా, సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మడు.. ప్రత్యేకమైన, భిన్నమైన ఫ్యాషన్ సెన్స్ అండ్ తనదైన బోల్డ్ దుస్తులతో నెట్టింట నిత్యం సంచలనం సృష్టిస్తూ ఉంటుంది. తన డ్రస్సులపై ఎన్ని విమర్శలు వచ్చిన, తనను ఎంత మంది ట్రోల్స్ చేసిన.. ఏ మాత్రం పట్టించుకోని ఈ బీటౌన్ బోల్డ్ బ్యూటీ ఎప్పటికప్పుడు వెరైటీ దుస్తులతో దర్శనం ఇస్తూ వైరల్ అవుతూనే ఉంటుంది. లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు సొంతం చేసుకుంటూ క్రేజీ హాట్ బ్యూటీగా దూసుకుపోతున్న ఉర్ఫీ.. మరోసారి తన వెరైటీ ఔట్ ఫిట్‌తో వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా.. నిన్ను ఆపడం ఎవడితరం కాదంటూ నెటిజన్లు కామెంట్స్‌తో రచ్చ చేస్తున్నారు.






