- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నానంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేసిన ఉర్ఫీ జావేద్.. అసలు ఏం జరిగిందంటే?
బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్(Urfi Javed) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు బిగ్‌బాస్ షో ద్వారా పుల్ పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్(Urfi Javed) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు బిగ్‌బాస్ షో ద్వారా పుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడు వెరైటీ దుస్తుల్లో కనిపించి అందరి చేత విమర్శలు ఎదుర్కొంది. అంతేకాకుండా కొన్ని బహిరంగంగా ప్రదేశాల్లోనూ తనకు నచ్చినట్లు ఉంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఇక ఉర్ఫీ జావెద్ వెరైటీ డిజైనింగ్ దుస్తులకు నెట్టింట్లో ఫుల్ క్రేజ్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. నిత్యం పలు పోస్టులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. అయితే ఉర్ఫీ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్‌గా ఉంటుంది.
తాజాగా, ఉర్ఫీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన పరిస్థితిని వెల్లడిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘గత కొన్ని రోజులుగా నేను నెట్టింట్లో యాక్టింగ్‌గా ఉండటం లేదు.. వీడియోలు అప్లోడ్ చేయడం లేదు.. ఎక్కడా కనిపించడం లేదన్న సంగతి తెలిసిందే. నేను ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను.. అందుకే అలా సైలెంట్ అయిపోయా.. నా వ్యాపారాలు సరిగ్గా నడవడం లేదు.. చాలా ట్రై చేశాను కానీ ప్రతీ చోటా తిరస్కారాలే ఎందుర్కొంటూ వస్తున్నాను.. కేన్స్‌కి వెళ్లే ఛాన్స్ వచ్చింది.. దీపా కోస్లా, క్షితిజ్ వల్లే ఆ ఆఫర్ వచ్చింది.. కానీ అనుకోని కారణాల వల్ల వీసా రాలేదు.. క్యాన్సిల్ అయింది.
క్రేజీ ప్రాజెక్టుల కోసం పని చేస్తున్నాను.. నా టీం అయితే నిస్పృహలో ఉంది.. నాకు తెలిసి చాలా మంది ఇలానే ఎన్నో సార్లు జీవితంలో రిజెక్షన్స్‌ను ఎదుర్కొని ఉంటారు.. మీ మీ రిజెక్షన్ కథల్ని చెప్పుకోండి.. మనకు మనం తోడుగా నిలుద్దాం.. రిజెక్షన్ ఎదురైందంటే.. జీవితం అక్కడితోనే ముగిసినట్టుంది.. ప్రతీ రిజెక్షన్ వెనకాల ఓ కారణం ఉంటంది.. సరిగ్గా చూస్తే దాన్నుంచే మనకు కొత్త అవకాశాలు రావొచ్చు.. ఏడుస్తూ కూర్చుని ఉంటే ఏం జరగదు.. నేను కూడా చాలా ఏడ్చాను.. కానీ లేచి నిలబడి ముందుకు పరుగెత్తాలి’’ అని రాసుకొచ్చింది. ఇక ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు నువ్వు మళ్లీ ముందులా ఉంటావు అని ధైర్యం చెబుతున్నారు.






