- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కీలక ప్రకటన విడుదల చేసిన బోల్డ్ బ్యూటీ.. చాలా బాధగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్
బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్(Urfi Javed) అందరికీ సుపరిచితమే. ఈఅమ్మడు సోషల్ మీడియాలో తన డ్రెస్సింగ్ స్టైల్‌తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

దిశ, సినిమా: బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్(Urfi Javed) అందరికీ సుపరిచితమే. ఈఅమ్మడు సోషల్ మీడియాలో తన డ్రెస్సింగ్ స్టైల్‌తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. నిత్యం నెట్టింట ఏదో ఒక వెరైటీ ఫొటో షూట్(Photo shoot)తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఊర్ఫీ తన ఫ్యాషన్‌తో ట్రోల్స్ ఎదుర్కొన్నప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా తనకు నచ్చింది చేస్తూ ట్రెండ్ కొనసాగిస్తుంది. సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ అంత క్రేజ్ సంపాదించుకుందనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఉర్ఫీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది.
నా షో ఫాలో అయ్యే వారందరికీ నా లైఫ్‌కు సంబంధించిన ఓ చిన్న అప్డేట్ ఇవ్వాలనుకున్నాను. నేను నా సొంత బ్రాండ్ ప్రారంభించబోతున్నాను. అయితే ఇందుకోసం సహ వ్యవస్థాపకుడిని కూడా చూశాను. సైన్స్ కూడా అయిపోయాయి. అంతా బాగానే ఉందనుకునే సమయంలో.. బోర్డు నిభంధనలను అంగీకరించడం లేదని అతను తప్పుకున్నాడు. ఈ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఇక నుంచి నన్ను ఎక్కువగా చూడరు. ఇబ్బందుల్లో ఉన్నాను. ఈ ప్రయాణం ఇక నుంచి ఎక్కడికి వెళుతుందో చూద్దాం. ప్రస్తుతానికి బ్రాండ్ లేదు బాధగా అనిపిస్తుంది’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మేమంతా ఉన్నాము బాధపడకు ఉర్ఫీ అని కామెంట్లు చేస్తున్నారు.






