Uppu Kapparambu: మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ పోస్టర్

by Chukka Sudharani |

సుహాస్ (Suhas), కీర్తి సురేష్ (Keerthy Suresh) జంటగా నటించిన లేటెస్ట్ సెటైరికల్ కామెడీ డ్రామా ‘ఉప్పు కప్పురంబు’ (Uppu Kapparambu).

Uppu Kapparambu: మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ పోస్టర్
X

దిశ, సినిమా: సుహాస్ (Suhas), కీర్తి సురేష్ (Keerthy Suresh) జంటగా నటించిన లేటెస్ట్ సెటైరికల్ కామెడీ డ్రామా ‘ఉప్పు కప్పురంబు’ (Uppu Kapparambu). ఐవీ శశి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ జూలై 4 నుంచి తెలుగుతో పాటు త‌మిళం, క‌న్నడ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. ఇటీవల ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి ప్రేక్షకుల్లో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను భారీగా పెంచారు. ఇక ఇందులో కీర్తి సురేష్ ఎన్నడు లేనంత విధంగా డిఫరెంట్‌గా కనిపించడంతో.. ట్రైలర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన వచ్చింది.

ఇప్పుడు ఇదే జోష్‌తో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేశారు చిత్ర బృందం. ఈ మేరకు బిలీవ్ ఇండియా లేబుల్ ద్వారా విడుదలైన ఈ అల్బమ్‌లో మూడు స్పెషల్ సాంగ్స్ ఉండగా.. ఈ పాటలు సినిమాలోని హాస్యాన్ని, భావోద్వేగాలను అన్నింటిని చూపిస్తున్నాయి. అలాగే.. కీర్తి సురేష్ డ్యాన్స్ అయితే వేరే లెవల్ అని చెప్పుకొచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన బీట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘కీర్తిని ఈ యాంగిల్‌లో ఎప్పుడు చూడలేదు.. కచ్చితంగా ఈ సినిమా నీకు మంచి సక్సెస్ ఇస్తుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. Link

Next Story