Upendra : ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ నుంచి ఉపేంద్ర స్పెషల్ పోస్టర్.. వింటేజ్ లుక్‌లో అదిరిపోయిన హీరో

by Chukka Sudharani |

హీరో రామ్ కెరీర్‌లో ఎంతో స్పెషల్‌గా రూపొందబోతున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.

Upendra : ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ నుంచి ఉపేంద్ర స్పెషల్ పోస్టర్.. వింటేజ్ లుక్‌లో అదిరిపోయిన హీరో
X

దిశ, సినిమా: హీరో రామ్ పోతినేని కెరీర్‌లో ఎంతో స్పెషల్‌గా రూపొందబోతున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. డైరెక్టర్ పి. మహేష్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచలి రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. ఇందులో కన్నడ స్టార్ ఉపేంద్ర ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు ఆయన పుట్టినరోజు కావడంతో.. ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి ఉపేంద్ర స్పెషల్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు మేకర్స్.

ఇందులో ఆయన సూర్య అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుపుతూ.. ‘ఆంధ్ర కింగ్ తాలూకాలో సూర్య పాత్రను ఉపేంద్ర పోషించిన తీరు.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. దీనిని సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి.. నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఆంధ్ర కింగ్ తాలూకా సందడి చేయనుంది’ అని తెలిపారు. ఇక ఉపేంద్ర వింటేజ్ లుక్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుండగా.. మూవీ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లింక్


Next Story