డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఒకేసారి రెండు సినిమాల అప్‌డేట్! (వీడియో)

by Chukka Sudharani |   (  Updated:2025-05-17 12:10:27  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఒకేసారి రెండు సినిమాల అప్‌డేట్! (వీడియో)
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. కానీ.. ఏ ఒక్క సినిమా నుంచి కూడా సరైనా అప్‌డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే డార్లింగ్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒకే సారి రెండు సినిమాల నుంచి అప్‌డేట్ వచ్చింది. ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ‘రాజాసాబ్’ (Rajasab)ఒకటి. మారుతి(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు ఆకట్టుకోగా.. ఇప్పుడు టీజర్ వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ రెండు రోజుల్లో ‘రాజాసాబ్’ డబ్బింగ్‌పై ఒక క్లారిటీ రాగా.. అంతా బాగుంటే ఈ నెలకారులో అదిరిపోయే టీజర్ రాబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. ఇక దీంతో పాటు.. ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘ఫౌజీ’(Fawzi)నుంచి కూడా ఓ అప్‌డేట్ వచ్చింది. హను రాఘవపూడి (Hanu Raghavapudi)దర్శకత్వంలో రాబోతున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ వచ్చే వారం నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ఈ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story