- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, సినిమా: ప్రజెంట్ చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇటీవల వచ్చిన ‘రాజాసాబ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకోకపోవడంతో.. తన తదుపరి చిత్రాలపై పూర్తి ఫోకస్ పెట్టనున్నాడు డార్లింగ్. ఈ మేరకు కొంచెం విరామం తీసుకుని మేకోవర్ అయ్యేందుకు, అలాగే రీచార్జ్ అవ్వడానికి ఇటలీకి చెక్కేశాడు. గత కొద్ది రోజులుగా నిర్విరామంగా షూటింగ్స్‌లో పాల్గొంటున్న ఈ పాన్ ఇండియా స్టార్ వేసవి వెకేషన్ కోసం ఇటలీకి బయలుదేరారు. ఈ మేరకు తాజాగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. కొద్ది రోజులు అక్కడే ఉండి ఫుల్ మేకోవర్ అయ్యాక మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో.. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2898 AD’ పార్ట్ 2 వంటి బాక్సాఫీష్‌ను షేక్ చేసే చిత్రాలు ఉన్నాయి. ప్రభాస్ ఇటలీ నుంచి వచ్చాక ఈ సినిమాల షూటింగ్, రిలీజ్‌లపై కూడా అప్డే్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.






