నువ్వు చూస్తున్నావు.. మేము నిన్ను చూస్తున్నాం.. క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్‌పై బిగ్గెస్ట్ అప్డేట్

by Chukka Sudharani |

ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే తన నటనతో ఆకట్టుకున్న వర్ష బొల్లమ్మ.. ప్రదాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘కానిస్టేబుల్‌ కనకం’.

నువ్వు చూస్తున్నావు.. మేము నిన్ను చూస్తున్నాం.. క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్‌పై బిగ్గెస్ట్ అప్డేట్
X

దిశ, సినిమా: ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే తన నటనతో ఆకట్టుకున్న వర్ష బొల్లమ్మ.. ప్రదాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘కానిస్టేబుల్‌ కనకం’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన ఈ క్రైం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఈ ఏడాది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతూ మంచి ఆదరణ దక్కించుకుంది. 1990ల కాలంలో శ్రీకాకుళంలోని రేపల్లెలో అడవి గుట్ట, మహిళల మిస్సింగ్ నేపథ్యంలో ట్విస్టులతో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ సీరిస్ లాస్ట్‌లో సస్పెన్స్‌గా ఆగిపోయింది. దీంతో ఈ సిరీస్‌కు సీక్వెల్ ఉండబోతున్నట్లు వార్తలు రాగా.. ఇప్పుడు దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ..

‘నువ్వు చూస్తున్నావు.. మేము నిన్ను చూస్తున్నాం.. సిద్ధంగా ఉండండి కనకం వచ్చే నెలలో రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రాబోతున్నది’ అంటూ ప్రకటించారు. వచ్చే నెల నుంచి డబుల్‌ ఫైర్‌తో కానిస్టేబుల్‌ కనకం తిరిగి రాబోతుందని ట్వీట్ ద్వారా వెల్లడించగా.. ఫుల్ ఖుష్ అవుతున్నారు ఆడియన్స్. ఈ ప్రాజెక్టులో రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ అవసరాల, రమణ భార్గవ్‌, కంచరపాలెం కిశోర్‌, జ్వాల కోటి, రాకేందు మౌళి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్‌ నిర్మించారు. లింక్


Next Story