- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సేతుపతి – సాయిపల్లవి క్రేజీ ప్రాజెక్ట్‌పై అప్డేట్.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పటి నుంచే?
సేతుపతి, సాయిపల్లవి, మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్టు సంబంధించిన షూటింగ్ అప్డేట్ వచ్చింది.

దిశ, సినిమా: నేచురల్ స్టార్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి, సాయి పల్లవి తొలిసారి కలిసి నటించనున్న తాజా చిత్రంపై ఆసక్తి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని లెజండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నాడు. మద్రాస్ టాకీస్ అండ్ లైకా ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్ నెంబర్ 23 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఫిలిమ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. సంగీత ప్రపంచానికి మాంత్రికుడు అయిన ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇదిలా ఉంటే.. సాయి పల్లవి నటించిన ఏక్ దిన్ చిత్రం మే 1న విడుదలయ్యేందుకు సిద్ధం అవుతున్నది. ప్రజెంట్ ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.






