- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ స్పిరిట్ రిలీజ్‌పై అదిరిపోయే అప్డేట్.. వాయిదా పడే ప్రసక్తే లేదు అంటూ పోస్ట్
సల్మాన్ ఖాన్ చిత్రం రిలీజ్ ఉండగా.. ప్రభాస్ ‘స్పిరిట్’ వాయిదా పడిందనే వార్తలపై హీరో టీమ్ స్పందిస్తూ అప్డేట్ ఇచ్చారు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘స్పిరిట్’ ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. గత కొద్ది రోజులుగా ఈ సినిమా వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న SVC63 ఈద్ కానుకగా 2027 మార్చి 5న రాబోతున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభాస్ స్పిరిట్ కూడా 2027 మార్చి 5న రిలీజ్ కావాల్సి ఉండగా సల్మాన్ కోసం ఈ చిత్రం వాయిదా వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
దీంతో తాజాగా స్పిరిట్ రిలీజ్‌పై అప్డేట్ ఇచ్చాడు ప్రభాస్ పీఆర్ఓ. ఈ మేరకు.. ‘‘స్పిరిట్’ చిత్ర నిర్మాతలు అధికారికంగా స్పష్టం చేశారు.. ఈ చిత్రం అనుకున్న ప్రకారమే శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. 5 మార్చి 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.. ఎటువంటి వాయిదా లేదు’ అంటూ ఓ పోస్టర్ షేర్ చేశాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన అప్డేట్ వైరల్ అవుతుండగా.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుంది.






