Siva Karthikeya: శివ కార్తికేయన్ షూటింగ్‌పై అప్డేట్.. వైల్డ్ ఫొటోస్ వైరల్

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ‘అమరన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Siva Karthikeya: శివ కార్తికేయన్ షూటింగ్‌పై అప్డేట్.. వైల్డ్ ఫొటోస్ వైరల్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ‘అమరన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేస్తూ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధం అయ్యాడు. ఆయన నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘మదరాసి’ ఒకటి. ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని శ్రీ లక్ష్మీ మూవీస్ రూపొందిస్తుంది. విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బిజు మీనన్, షబీర్, విక్రాంత్, విద్యుత్ జామ్వాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అనురుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. అలాగే అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం.. తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుపుతూ ఓ పోస్ట్ నెట్టింట ప్రత్యక్షమైంది. ఈ మేరకు ‘‘మదరాసి’ చిన్న ప్యాచ్ వర్క్‌తో షూటింగ్ పూర్తి చేసుకుంది.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు & హిందీ భాషలలో థియేటర్లలో విడుదల కానుంది’ అంటూ వైరల్ అవుతున్న పోస్ట్‌లో వైల్డ్ లుక్‌లో ఉన్న శివకార్తికేయన్ పిక్స్ నెట్టింట అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. లింక్

Next Story