- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయిపల్లవి తదుపరి చిత్రంపై అప్డేట్.. త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ కాబోతుందంటూ పోస్ట్
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇప్పుడు బాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు చేస్తుంది.

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇప్పుడు బాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు చేస్తుంది. ఇందులో బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘ఏక్ దిన్’ ఒకటి. అమీర్ కాన్ కుమారుడు జువైద్ ఖాన్‌తో ఆమె నటించి ఈ రొమాంటిక్ డ్రామాకు సునీల్ పాండే దర్శకత్వం వహిస్తుండగా.. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం మే 1న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాతో బిజీగా ఉన్న సాయి పల్లవి త్వరలోనే విజయ్ సేతుపతితో నటించే ప్రాజెక్టులో జాయిన్ భాగం కానుంది. నేచురల్ స్టార్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి, సాయి పల్లవి తొలిసారి కలిసి నటించనున్న చిత్రంపై అనౌన్స్ నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రాన్ని లెజండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నాడు. మద్రాస్ టాకీస్ అండ్ లైకా ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుందని ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముండగా.. మొదటి షెడ్యూల్‌లో విజయ్ సేతుపతి, సాయి పల్లవిపై చిత్రీకరణ జరపనున్నట్లు టాక్. కాగా.. సంగీత ప్రపంచానికి మాంత్రికుడు అయిన ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.






