OG: నేహాశెట్టి సాంగ్‌తో పాటు మరికొన్ని సీన్స్ యాడ్ చేయనున్న ఓజీ టీమ్.. ఎప్పటినుంచంటే?

by Chukka Sudharani |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఓజీ’.. భారీ అంచనాల మధ్య ఈరోజు (సెప్టెంబర్ 25, 2025) థియేటర్‌లోకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది.

OG: నేహాశెట్టి సాంగ్‌తో పాటు మరికొన్ని సీన్స్ యాడ్ చేయనున్న ఓజీ టీమ్.. ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఓజీ’.. భారీ అంచనాల మధ్య ఈరోజు (సెప్టెంబర్ 25, 2025) థియేటర్‌లోకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. పవన్ కల్యాణ్‌ను మాస్ అండ్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో చూసిన ఫ్యాన్స్‌కు ఇది ఫుల్ మీల్స్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు. అయితే.. ఓజీ సినిమాలో పలు సీన్స్ కట్ అయిన కారణంగా అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నేహా శెట్టి స్పెషల్ సాంగ్ ఒకటి. ఓజీలో నేహా ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు.. నేహా శెట్టి కూడా అఫీషియల్‌గా ఓ ఈవెంట్‌లో ప్రకటించింది. అయితే.. సినిమాలో ఆమె కనిపించకపోయే సరికి కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే వారికి కిక్ ఇచ్చే అప్డేట్ ఒకటి వచ్చింది. నేహా శెట్టి స్పెషల్ సాంగ్‌తో పాటు పలు సీన్స్ ఈ సోమవారం నుంచి యాడ్ చేయనున్నట్లు ఓ ట్వీట్ వైరల్ అవుతుంది. దీంతో మరోసారి థియేటర్స్‌కు వెళ్లి రచ్చ చేయాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. లింక్


Next Story