- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Allu Arjun and Atlee: అల్లు అర్జున్, అట్లీ షూటింగ్‌పై అప్‌డేట్.. ఆనందంలో ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం ‘AA-22’తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం ‘AA-22’తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ‘పుష్ప, పుష్ప-2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ‘AA-22’పై బన్ని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తుండగా.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే.. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ తర్వాత మరో అప్‌డేట్ రాలేదు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన లేటెస్ట్ బజ్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. ఈ ‘AA-22’కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూలై (July) నుండి మొదలయ్యే చాన్స్ ఉన్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. అంతే కాకుండా.. జూలైలో కచ్చితంగా ఒక షెడ్యుల్ మొదలు పెట్టే ఆలోచనలో ఉండగా.. ఫస్ట్ షూట్ ముంబైలో ఉండొచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానప్పటికీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






