PrabhasHanu : ఫైనల్లీ ప్రభాస్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. రేపే అంటూ మైత్రీమూవీ మేకర్స్ బిగ్ అప్డేట్

by Chukka Sudharani |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

PrabhasHanu : ఫైనల్లీ ప్రభాస్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. రేపే అంటూ మైత్రీమూవీ మేకర్స్ బిగ్ అప్డేట్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇందులో సలార్-2, కల్కి-2, స్పిరిట్ వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో పాటు.. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాతో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నది. ఇక ప్రభాస్, హను రాఘవపూడి కాంబో ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు తప్పా.. ఇందులో నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ ఈ మూవీ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది మైత్రీమూవీ మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. ‘ఈ.. యుద్ధం.. డిమాండ్స్.. ఒక.. బెటాలియన్..! ప్రభాస్, హను ఫైర్.. రేపు సాయంత్రం 4:05 గంటలకు రాబోతున్నది’ అంటూ ప్రకటించారు. ఈ సినిమాకు ఇప్పటికే ఫౌజీ టైటిల్ ఫిక్స్ కాగా.. ఇప్పుడు ఇందులో నుంచి ఎలాంటి అప్డేట్ రాబోతుందా అని క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్ అండ్ సినీ లవర్స్. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, టి సిరీస్ బ్యానర్స్‌పై నవీన్ యెర్నేని, ఎలమంచిలి రవిశంకర్, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. లింక్


Next Story