- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pawan Kalyan's 'OG': పవన్ కల్యాణ్ OG నుంచి BIG అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రజెంట్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

దిశ, సినిమా: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రజెంట్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అలాగే గతంలో ఆయన ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసేందుకు రీసెంట్‌గా షూటింగ్ సెట్(Shooting set)లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ‘హరహర వీరమల్లు’ (Harahara Veeramallu)కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసేందుకు ఇటీవల షూటింగ్‌లో జాయిన్ అయినా ఆయన.. ఇప్పుడు మరో చిత్రం షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. పవన్ కల్యాణ్ ఒప్పుకున్న చిత్రాల్లో ‘ఓజీ’ (OG) ఒకటి. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సుజిత్ (Sujith) దర్శకత్వం వహిస్తు్న్నాడు. ఇందులో బాలీవుడ్ (Bollywood) నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనపించనున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా కెమెరా డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సభ్యుడు ‘ఈరోజు ఓజీ షూటింగ్ ప్రారంభమైంది’ అంటూ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతుండగా.. ఆ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ‘మళ్లీ మొదలైంది.. ఈసారి మోగిపోద్ది’ అంటూ డీవీడీ ఎంటర్‌టైన్మెంట్ మరో ట్వీట్ పెట్టింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ట్వీట్స్ వైరల్ అవుతుండగా.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.






