"మన శంకర వర ప్రసాద్ గారు" నుండి మరో అప్డేట్.. సెకండ్ సింగిల్ ఎప్పుడంటే?

by Ajay Maddhiboyina |

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు.

మన శంకర వర ప్రసాద్ గారు నుండి మరో అప్డేట్.. సెకండ్ సింగిల్ ఎప్పుడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్రంలో నయనతార చిరుకు జోడీగా నటిస్తోంది. సాహు గరికపాటి సుస్మిత కొనిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు బీమ్స్ సిసిలిరియో స్వరాలు సమకూరుస్తుండగా ఇప్పటికే విడుదలైన మీసాల పిల్ల పాట శ్రోతలను ఎంతగానో అలరించింది.

ఇప్పటికే ఈ పాటకు యూట్యూబ్ లో 75మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి. ఇక తాజాగా సెకండ్ సింగిల్ పై చిత్రయూనిట్ అప్డేట్ ఇచ్చింది. శశిరేఖ పేరుతో ఈ పాటను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది సినిమాలోని మరో మెలోడీ అని పేర్కొంది. ఇక ఈ పాట ప్రోమోను డిసెంబర్ 6వ తేదీన విడుదల చేస్తామని, లిరికల్ వీడియోను 8న విడుదల చేస్తామని ప్రకటించింది. సాంగ్ కలర్ ఫుల్ గా ఉండబోతుందని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని ప్రకటించింది.

Next Story