- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anasuya: అనసూయ సినిమా నుంచి అప్‌డేట్.. వైరల్ అవుతోన్న పోస్టర్
పేపర్ బాయ్ ఫేం జయ శంకర్ (Jaya Shankar) దర్శకత్వంలో రాబోతున్న మైథలాజికల్ థ్రిల్లర్ (Mythological thriller) మూవీ ‘అరి’.

దిశ, సినిమా: పేపర్ బాయ్ ఫేం జయ శంకర్ (Jaya Shankar) దర్శకత్వంలో రాబోతున్న మైథలాజికల్ థ్రిల్లర్ (Mythological thriller) మూవీ ‘అరి’. ఇందులో స్టార్ యాంకర్ అనసూయ(Anasuya)తో పాటు సాయి కుమార్, శుభలేక సుధాకర్, ఆమని, వైవా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సస్పెన్సింగ్ మూవీ గతేడాదే రిలీజ్ కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. అయితే.. ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించలేదు కానీ.. ప్రమోషన్స్ మాత్రం డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అలాగే ఇటీవల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మఠాధిపతులు, స్వామిజీలు ‘అరి’ మూవీని చూపి ప్రశంసలు కురిపించారు.
అకిషడ్వర్గాల మీద తీసిన ఈ చిత్రం ఇప్పటి తరానిరి చాలా ముఖ్యమని, సినిమా అద్భుతంగా ఉందని స్పెషల్ షోని చూసిన వారంతా కూడా పొగిడేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ‘థీమ్ సాంగ్ యొక్క శక్తి కేవలం వినబడదు.. అది అనుభూతి చెంది.. ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అరి థీమ్ సాంగ్ (Theme song) లిరికల్ వీడియో ఏప్రిల్ 5, 2025న విడుదల అవుతుంది’ అంటూ ఓ పోస్ట షేర్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A theme song of power is not just heard; it is felt, lived, and forever remembered. 🔥🎶#AriThemeSong lyrical video drops on April 5th, 2025! #AriTheMovie #MyNameIsNobody❤️🔥 pic.twitter.com/EVmYC8x8do
— Suresh PRO (@SureshPRO_) April 2, 2025






