బిడ్డ కోసం ఉపాసన-రాంచరణ్ మరో నిర్ణయం.. దీని కోసమే వాళ్లు పదేళ్లుగా పిల్లలను కనలేదా..?

by Chukka Sudharani |   (  Updated:2023-07-01 15:02:34  IST  )

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలె పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

బిడ్డ కోసం ఉపాసన-రాంచరణ్ మరో నిర్ణయం.. దీని కోసమే వాళ్లు పదేళ్లుగా పిల్లలను కనలేదా..?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలె పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దాదాపుగా 11 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మెగా ఫ్యామిలీకి, మెగా అభిమానులకు ఆ బిడ్డ రాకతో పండగా వాతావరణం కనిపించింది. తాజాగా ఆ బిడ్డ పేరు ‘క్లిన్ కారా’ అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఉపాసన, రాంచరణ్ వార్తలతోనే నిండిపోతుంది. మెగా కోడలు గర్భం దాల్చినప్పటి నుంచి ఆమె డెలవరై ఇంటికి చేరినా మీడియా వారిని వదలడం లేదు. ప్రతిచిన్న విసయాన్ని నెట్టింట వైరల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తెచ్చింది సోషల్ మీడియా.

అదేంటంటే ఇంట్లో లక్షల రూపాయల శాలరీలు తీసుకునే పని వాళ్లు ఉన్నా ఉపాసన తన బిడ్డ కోసం ఉపయోగిండం లేదట. దానికి ఓ కారణం ఉందట. కొణిదల ఫ్యామిలీ మెంబర్సే సుమారుగా 40 మంది వరకు ఉంటారట. అయితే తన కూతురి చూసుకోవడానికి, సంరక్షించడానికి ఇటు ఇంట్లో వారిని కానీ అటు పని వాళ్లని కానీ ఉపయోగించుకోవడం లేదట. స్వయంగా ఉపాసననే బిడ్డను చూసుకుంటుందంట. బిడ్డను స్వయంగా చూసుకునేందుకే ఆమె పదేళ్లుగా పిల్లలను కనలేదట. బిజినెస్‌లు చేసే ఉపాసన ఆమె బిజీ లైఫ్‌లో పిల్లలకు జన్మనిస్తే వారిని చూసుకునే సమయం ఉండదనే ఇన్నాళ్లు ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకున్నదట. ప్రస్తుతం బిడ్డ పుట్టిన సందర్భంగా నాలుగు నెలల వరకు రాంచరణ్‌ను కూడా షూటింగ్‌లు ఆపేయాలని, పాపతో గడపాలని కోరిందట. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో మెగా ఫ్యామిలీనే చెప్పాలి.

Read More..

రేణు దేశాయ్ పోస్ట్.. మరోసారి చిక్కుల్లో పవన్ కల్యాణ్!

కూతురు పేరులో తండ్రి చిరంజీవికి ప్రాధాన్యత ఇవ్వని చరణ్.. pawan kalyan పేరే ఫిక్స్

Next Story