Upasana: అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్ ప్రకటించిన ఉపాసన.. వైరల్‌గా మారిన పోస్ట్

by Hamsa |
Upasana: అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్ ప్రకటించిన ఉపాసన.. వైరల్‌గా మారిన పోస్ట్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సతీమణి ఉపాసన(Upasana) సినిమా ఇండస్ట్రీకి పరిచయం లేనప్పటికీ తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్ ఉంటూ పలు పోస్టులతో ఎంతో మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. తన కూతురు క్లిన్ కారా బాగోగులను చూసుకుంటూనే తన ఫ్రొఫెషన్‌కు కూడా ముందుకు తీసుకెళుతుంది. అంతేకాకుండా సామాన్యులకు సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఉపాసన అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఆమె ఓ హీరోయిన్‌కు ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ మెసేజ్ హాట్ టాపిక్‌గా మారిందనడంలో అతిశయోక్తి లేదు. అసలు మెగా కోడలు ఎవరికి రిప్లై ఇచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం.

అసలు విషయంలోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ అమ్మడు మంగళవారం నాడు ఎంతో మంది నమ్మే చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసింది. ఆ స్వామి వారిని దర్శించుకుని కొత్త జర్నీ ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్ట్ కూడా పెట్టింది. అయితే దీనికి మెగా కోడలు ఉపాసన ‘‘మీ కొత్త చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. శ్రీ వేంకటేశ్వరుడు మిమ్ములను సమృద్ధిగా అనుగ్రహించునుగాక’’ అని రిప్లై ఇచ్చింది. అయితే ఆప్రాజెక్ట్ రాజమౌళి(Rajamouli), మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో రాబోతున్న ‘SSMB-29’గురించే అని అంతా పిక్స్ అయిపోయారు.

ఈ సినిమాలో ప్రియాంక హీరోయిన్‌గా నటిస్తున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఉపాసన రిప్లైతో ఆ వార్తలు నిజమే అని తేలిపోయింది. ‘SSMB-29’ స్టార్ చేసినప్పటి నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా నిమిషాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ బాబు అభిమానుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రాజమౌళి కూడా వారి ఊహలకు మించి ఉండబోతున్నట్లు హింట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం పలు షూటింగ్ కోసం పలు ప్రదేశాలు వెతికే పనిలో ఉన్నారు. ఇక మహేష్ బాబు విషయానికొస్తే.. ఆయన సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటూ పూర్తిగా ‘SSMB-29’పైన ఫుల్ పోకస్ పెట్టారు. అన్ని విద్యలు నేర్చుకుంటూ తెగ కష్టపడిపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed