- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Instagram hacked: స్టార్ హీరో ఇన్‌స్టా హ్యాక్.. ఆ మెసేజులు నేను పెట్టడం లేదు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ విజ్ఞప్తి
ఈ మధ్య కాలంలో నటీనటులకు సంబంధించిన సోషల్ మీడియాల అకౌంట్స్ ఎక్కువగా హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో నటీనటులకు సంబంధించిన సోషల్ మీడియాల అకౌంట్స్ ఎక్కువగా హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వాటిని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సామాన్యులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో స్టార్ హీరో ఇన్‌స్టా హ్యాక్ అయినట్లు తెలుస్తుంది. మలయాళ స్టార్ట్ హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan).. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయినట్లు ఫేస్‌బుర్ ద్వారా తెలిపారు. తన ఇన్‌స్టా నుంచి వస్తున్న అప్డేట్‌లు, మెసేజులు తాను పంపిస్తున్నవి కావని స్పష్టం చేశారు. DM (సందేశాలు), స్టోరీలు, ఇతర విషయాలు కూడా తాను షేర్ చేయడం లేదని, హ్యాక్ అయిన తన అకౌంట్ నుంచి ఎలాంటి సందేశాలు వచ్చిన, లింకులు వచ్చిన వాటిని ఓపెన్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని తన అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అలాగే ఈ ప్రాబ్లెమ్‌ను పరిష్కరించడానికి.. తన అకౌంట్‌ను తిరిగి పొందడానికి తనతో పాటు సైబర్ అధికారులు పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సమస్య పూర్తిగా పరిష్కరించబడిన తర్వాత తన ఫేస్‌బుక్ ద్వారా అభిమానులకు అప్‌డేట్ చేస్తానని తెలిపారు ఉన్ని ముకుందన్.






