- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్రివిక్రమ్ మూవీకి బ్రేకులు వేసిన ఆ అజ్ఞాత వ్యక్తి ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో (Tollywood ) చాలామంది దర్శక ధీరులు ఉన్నారు. ఇందులో కొంతమంది దర్శకులు... సక్సెస్ అయితే మరి

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో (Tollywood ) చాలామంది దర్శక ధీరులు ఉన్నారు. ఇందులో కొంతమంది దర్శకులు... సక్సెస్ అయితే మరి కొంత మంది అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. అయితే మినిమం గ్యారంటీ దర్శకులు కూడా ఉంటారు. అలాంటి వారిలో త్రివిక్రమ్ (Trivikram ) ఒకరు. త్రివిక్రంతో సినిమాలు చేయాలని హీరోలే ఎగబడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన సక్సెస్ రేట్... ఓ రేంజ్ లో ఉంటుంది. ఒకవేళ కథ జనాలకు నచ్చకపోయినా మినిమం కలెక్షన్స్.. వచ్చేస్తాయి.
అందుకే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో.. త్రివిక్రమ్ కు క్రేజ్ అంతలా ఉంటుంది. అయితే అలాంటి త్రివిక్రమ్, బన్నీ ( Allu Arjun ) కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందని జోరుగా ప్రచారం సాగింది. కానీ చివరికి ఆ సినిమా తారక్ ( junior NTR ) వద్దకు వెళ్ళినట్టు చెబుతున్నారు. దీనికి ప్రత్యేక కారణం ఉన్నట్లు చెబుతున్నారు. సుబ్రహ్మణ్యస్వామి కథను ( Subramanyam Swamy) అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేయాలని అనుకున్నారట.
ఇప్పటికే ఇండస్ట్రీలో శివుడు, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి ఇలా అనేక రకాల కథలు వచ్చాయి. సుబ్రహ్మణ్య స్వామి కథతో ఎవరు సినిమా తీయలేదు. అందుకే... త్రివిక్రమ్ ఆ కథను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఈ కథ నేపథ్యంలో బన్నీ.. రిజెక్ట్ చేశాడని.. ఆ కథ జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు. సోషల్ మీడియాలో మాత్రం... ఈ న్యూస్ వైరల్ అవుతుంది.






