- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాస్తవ సంఘటనల ఆధారంగా ‘అండర్-18’..వైరల్‌గా మారిన పూజా వేడుకల ఫొటోలు
తమిళంలో ‘అండర్-18’ అనే క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను మేకర్స్ ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు.

దిశ, సినిమా: టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది క్రేజీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్. భాషతో సంబంధం లేకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఐశ్వర్య, అదే జోష్‌తో వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెడుతోంది. ప్రస్తుతం తెలుగులో ‘ఓ సుకుమారి’ సినిమా చేస్తున్న ఈ బ్యూటీ, తాజాగా తమిళంలో ‘అండర్-18’ అనే క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను మేకర్స్ ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు సీనియర్ స్టార్ దంపతులు శరత్ కుమార్, రాధిక ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పూజా ముహూర్తపు వేడుకలో ఐశ్వర్య రాజేష్ సాంప్రదాయమైన చీర కట్టులో ఎంతో అందంగా మెరిసింది.
దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 18 ఏళ్ల లోపు ఉండే యువత చుట్టూ ఈ కథ తిరగబోతోంది. సమాజంలో పెద్దగా వెలుగులోకి రాని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నేర ప్రపంచం బారిన పడిన ఒక సాధారణ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడింది, వారి మధ్య ఉండే భావోద్వేగాలు ఏంటి అనే పాయింట్‌తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, విక్రాంత్‌కు జోడీగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. గతంలో ప్రముఖ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కార్తీక్ పెరుమాల్‌సామి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఎస్ ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జగదీష్ ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.






