- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ది ఎండ్ కార్డు అప్పుడే పడుతుంది.. మనోజ్ షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు పెంచిన మంచు మనోజ్.. పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్స్‌లో మెప్పిస్తూనే, హీరోగాను సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు.

దిశ, సినిమా: ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు పెంచిన మంచు మనోజ్.. పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్స్‌లో మెప్పిస్తూనే, హీరోగాను సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ఇక ఈ హీరో తన బర్త్‌డే సందర్భంగా హీరోగా ఓ మూవీ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీ చంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK111’లో కూడా ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇలా సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులకు అందుబాటులో ఉండే ఈ హీరో.. తాజాగా మోటివేషనల్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచాడు. ఈ మేరకు ‘జీవితంలో ఏదో ఒక చోట, ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయిపోవడం సర్వసాధారణం. అంతే కాదు వచ్చిన అడ్డంకులను అధిగమించగానే, మరొకటి అనివార్యంగా ఎదురవుతుంది. అయితే.. ఒక కష్టం వచ్చిందని దిగులుగా కూర్చుంటే, మీరు ఉన్నచోటనే నిలిచిపోతారు. ఏదో ఒక కష్టం వచ్చింది కదా అని అక్కడే ఆగిపోకూడదు.. జీవితంలో ఇంకా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉంటాయి. కష్టాలు ఒక నిర్దిష్ట వర్గం లేదా హోదాకు చెందిన వారిని మాత్రమే వస్తుంటాయని అందరూ భావించవచ్చు. కానీ అందులో నిజం లేదు.. సుఖదుఃఖాలు అందరికీ సమానంగా వస్తాయి. మనం చివరిసారిగా కళ్ళు మూసుకున్నప్పుడు మాత్రమే ‘ది ఎండ్’ కార్డు కనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.






