ఈ బాధను భరించలేకపోతున్నా.. నా చావుకు కారణంగా వారేనంటూ బోరున ఏడుస్తున్న వీడియో రిలీజ్ చేసిన ఢీ డ్యాన్సర్

by Mallepaka Hamsa |

బుల్లితెర డ్యాన్స్ షో ఢీ(dhee) వల్ల ఎంతోమంది తమ టాలెంట్‌ను నిరూపించుకున్నారు. కొంతమంది సినిమాల్లోనూ ఆఫర్లు అందుకున్న విషయం తెలిసిందే.

ఈ బాధను భరించలేకపోతున్నా.. నా చావుకు కారణంగా వారేనంటూ బోరున ఏడుస్తున్న వీడియో  రిలీజ్ చేసిన ఢీ డ్యాన్సర్
X

దిశ, సినిమా: బుల్లితెర డ్యాన్స్ షో ఢీ(dhee) వల్ల ఎంతోమంది తమ టాలెంట్‌ను నిరూపించుకున్నారు. కొంతమంది సినిమాల్లోనూ ఆఫర్లు అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఢీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో జాను లిరి(Janu Liri) కూడా ఒకరు. ఆమె కొరియోగ్రాఫర్‌గానూ పలు ప్రైవేట్ సాంగ్స్ చేసింది. అంతేకాకుండా టీవీ షోల్లోనూ పాల్గొన్న జాను తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా జాను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బోరున ఏడుస్తున్న వీడియోను షేర్ చేసి అందరిని షాక్‌కు గురి చేసింది. ‘‘నా ఓపిక నశించింది. బాధను తట్టుకోలేకపోతున్నాను. ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నా జీవితం మీద కొంతమందికి అంత ఇంట్రెస్ట్ ఎందుకో అర్థం కావడం లేదు మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు కదా.

ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోకండి నా కొడుకును మంచిగ చదివించి మంచి పోజిషన్‌లో చూడాలనుకుంటున్నాను. కానీ మీరంతా ఇలా చేస్తుంటే నేను మధ్యలోనే చనిపోతా అనిపిస్తుంది. నేను ఈ పోస్ట్ పెట్టినంత మాత్రాన నా గురించి చెడుగా మాట్లాడటం ఆపేస్తారని కాదు కానీ నాకు ఓపిక నశించింది. అన్నయ్యతో మాట్లాడినా.. తమ్ముడితో మాట్లాడినా.. చెల్లితో మాట్లాడినా.. కూర్చున్నా.. నించున్నా.. చెడుగానే చూస్తున్నారు. నేనేం పాపం చేశాను. నాకు నరకం కనిపిస్తుంది. నేను భరించలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. చాలామంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంటే.. ఏదో అనుకున్నాను. ఇలాంటి బాధలుపెడుతుంటే ఎలా బతకగలరు.

ఆ బాధలో ఉన్నోళ్లకే తెలుస్తుంది. అలా ఎలా చనిపోతారని అనుకున్నాను కానీ.. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను ఆ బాధ. ఒక ప్రాణం పోయిన తర్వాత మీరు చేసేదేం లేదు. ఒకరిని చంపి.. ఒకరిని.. బాధపెట్టి మీరు బతకొద్దు. మీరు చాలా తప్పు చేస్తున్నారు.ఫస్ట్ టైమ్ అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని. వీటన్నింటికీ దూరంగా ఎక్కడికన్నా వెళ్లి దూరంగా వెళ్లి చచ్చిపోవాలనిపిస్తుంది. నిజంగా నా లైఫ్‌లో ఏమీ లేకుండా ఉండి ఉంటే.. ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేదాన్ని. నేను చచ్చిపోతే కారణం మీరే అవుతారు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అలాగే కామెంట్ బాక్స్‌ను ఆఫ్ చేసింది.

Next Story