ఆ నొప్పిని భరించలేకపోయా.. హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్న ఫొటో షేర్ చేస్తూ రష్మీ ఎమోషనల్ పోస్ట్.. ఆందోళనలో ఫ్యాన్స్

by Mallepaka Hamsa |

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Gautam) జబర్దస్త్ ద్వారా ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది.

ఆ నొప్పిని భరించలేకపోయా.. హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్న ఫొటో షేర్ చేస్తూ రష్మీ ఎమోషనల్ పోస్ట్.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Gautam) జబర్దస్త్ ద్వారా ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఇందులో ముఖ్యంగా సుధీర్‌(Sudheer)తో కలిసి పలు స్పెషల్ షోలు కూడా చేసింది. అలాగే రష్మీ హీరోయిన్‌గా పలు సినిమాల్లోనూ నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అంతటితో ఆగకుండా సీరియల్స్‌లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస షోలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తోంది. అంతేకాకుండా సమాజంలో జరుగుతున్న విషయాలపై కూడా తనదైన స్టైల్లో పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, రష్మీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి అందరినీ షాక్‌కు గురి చేసింది. ‘‘గత కొద్ది రోజుల నుంచి నా ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు.

ఏదో తేడా కొడుతోందని అనుమానం వచ్చింది. దీంతో త్వరగా కమిట్మెంట్లను పూర్తి చేసుకున్నాను. వీపరీతమైన రక్త స్రావం ఒళ్లు నొప్పులు ఎక్కువ అయ్యాయి. చివరకు నాకు హిమోగ్లోబిన్ స్థాయి మొత్తానికి 9కి పడిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాక హాస్పిటల్‌లో చేరాను. జనవరి నుంచి కంటిన్యూగా రక్తస్రావం అవుతూనే ఉంది. భుజాలు కూడా చాలా నొప్పి పుట్టించేవి. ఆ బాధను భరించలేకపోయేదాన్ని అసలు ఈ సమస్య గురించి ఏ డాక్టర్‌ను కన్సల్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఎలాగోలా మార్చి 29 వరకు మ్యానేజ్ చేశాను.

అంత వరకు నా కమిట్మెంట్లను చాలా కష్టంగానే పూర్తి చేసిందట. ఏప్రిల్ 18న ఆపరేషన్ అయింది. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. నేను పనిని పునఃప్రారంభించే వరకు తదుపరి మూడు వారాలు విశ్రాంతి తీసుకుంటాను. పై ఫోటో OT కి ముందు ఉన్నాయి. Ot తర్వాత చాలా భయమేస్తుంది’’ అని రాసుకొచ్చింది. అలాగే హాస్పిటల్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. కానీ తనకు వచ్చిన సమస్య ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. ప్రస్తుతం రష్మీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story