డిప్రెషన్ తట్టుకోలేక లోకల్ ట్రైన్ నుంచి దూకి చనిపోవాలని అనుకున్నా..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-07 04:55:38  IST  )

‘సీతారామం’(Seetaramam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

డిప్రెషన్ తట్టుకోలేక లోకల్ ట్రైన్ నుంచి దూకి చనిపోవాలని అనుకున్నా..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘సీతారామం’(Seetaramam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో సీరియల్లో హీరోయిన్‌గా నటించిన ఈ చిన్నది ఈ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలాగే తన అందచందానికి తెలుగువారు ఫిదా అయ్యారు. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని మంచి స్టార్‌డమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అడివి శేష్(Adivishesh) ‘డెకాయిట్’(Decoit), అల్లు అర్జున్(Allu Arjun)-అట్లీ(Atlee) సినిమాలు ఉన్నాయి.

ఇక నిత్యం ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో మాత్రం నెట్టింట తన గ్లామర్‌తో రచ్చ రచ్చ చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘సీరియల్స్‌తో గుర్తింపు వచ్చాక సినిమా ప్రయత్నాలు చేశాను. సినిమాలకు ఆడిషన్స్‌కి వెళ్ళినప్పుడు టీవీ నటి అని చులకనగా చూసేవాళ్ళు. దాని వల్ల డిప్రెషన్‌కి కూడా గురయ్యాను. ఓ సారి ఆ డిప్రెషన్ తట్టుకోలేక లోకల్ ట్రైన్ నుంచి దూకి చనిపోవాలని అనుకున్నా.. కానీ పేరెంట్స్ గుర్తొచ్చి ఆగిపోయాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story